డెకాయిట్ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. శేష్, మృణాల్‌లకు గాయాలు ?

by Naga Rani Yarlagadda |

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ (Decoit). తాజాగా ఈ చిత్రం షూటింగ్ స్పాట్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

డెకాయిట్ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. శేష్, మృణాల్‌లకు గాయాలు ?
X

దిశ, వెబ్‌డెస్క్: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ (Decoit). తాజాగా ఈ చిత్రం షూటింగ్ స్పాట్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరగ్గా.. మృణాల్, శేష్‌లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. గాయాలైనా షూటింగ్‌ను కంప్లీట్ చేశారని, ఆ తర్వాత ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. కాగా.. ఇద్దరికీ పెద్ద గాయాలేవీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయాలైనా షూటింగ్ కంప్లీట్ చేయడంతో.. పనిపై వారికున్న డెడికేషన్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

షానిల్ డియో డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. కాగా.. అడివి శేష్.. గూఢచారి, ఎవరు, హిట్ 2, మేజర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకోగా.. మృణాల్ ఠాగూర్ సీతారామంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. హాయ్ నాన్న, ఫ్యామిలీ మ్యాన్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైంది. ప్రస్తుతం డెకాయిట్‌లో నటిస్తోన్న మృణాల్.. త్వరలోనే అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో రూపొందే సినిమాలో నటించనుంది.

Next Story