ఒక్క ప్రొడ్యూసర్.. ఒకేసారి 15 చిత్రాల నిర్మాణం..

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-09 18:16:31  IST  )

20 ఏళ్ల వ్యవధిలో 114 పైగా చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ... గతేడాది ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభించి... ప్రపంచ రికార్డ్ నెలకొల్పడం తెలిసిందే.

ఒక్క ప్రొడ్యూసర్.. ఒకేసారి 15 చిత్రాల నిర్మాణం..
X

దిశ, సినిమా : 20 ఏళ్ల వ్యవధిలో 114 పైగా చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ... గతేడాది ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభించి... ప్రపంచ రికార్డ్ నెలకొల్పడం తెలిసిందే. ఇప్పుడు ఆ 15 చిత్రాల్లో 7 చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి, ఆ చిత్రాల ట్రైలర్స్ అన్నీ ఒకే రోజు ఒకే వేదికపై ఆవిష్కరించి తన సత్తాను మరోసారి ఘనంగా చాటుకున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాణమవుతూ ట్రైలర్స్ విడుదల జరుపుకున్న ఆ ఏడు చిత్రాలు... ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో "మహానాగ", రవి బాసర దర్శకత్వంలో "యండమూరి కథలు", విజయ్ ఎర్రంశెట్టి దర్శకత్వంలో "మా నాన్న హీరో", నూతన్ దర్శకత్వంలో "రోబో-47", "మహాబలుడు", హర్ష దర్శకత్వంలో "రుద్రతాండవం", సాయి రమేష్ దర్శకత్వంలో "మనం-2036". కాగా ఈ చిత్రాల ట్రైలర్ రిలీజ్ వేడుకకు.. సుమన్, సాయికుమార్, వి.విజయేంద్రప్రసాద్, కె.ఎస్.రామారావు, రేలంగి నరసింహారావు, యండమూరి వీరేంద్రనాధ్, జె.కె.భారవి, వీర శంకర్, చంద్ర మహేష్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, టి.ప్రసన్నకుమార్, కె.అశోక్ కుమార్, కవిత, కల్వ సుజాత గుప్త, వి విజయ్ కుమార్ హాజరయ్యారు. మొత్తం 15 చిత్రాలకు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్‌ను ఈ సందర్భంగా సత్కరించారు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.

Next Story