అన్నతో పెళ్లి.. సొంత తల్లే అత్తగా మారి టార్చర్ పెట్టింది.. ఇక బిడ్డ పుట్టాక.. పాపం ఈ హీరోయిన్ కష్టాలపై సీరియల్ తీయొచ్చు..

by Sujitha Rachapalli |

పాకిస్తానీ నటి జవేరియా అబ్బాసీ పర్సనల్ లైఫ్ ఎప్పుడూ చర్చనీయాంశమే. కారణం ఆమె స్టెప్ బ్రదర్‌ను పెళ్లి చేసుకుని.. సొంత తల్లినే అత్తగా మార్చుకుంది. 1997లో తన పదిహేడేళ్ల వయసులో షమూన్‌ను వివాహం చేసుకుని హెడ్ లైన్స్‌లో నిలిచింది. వీరిద్దరి బంధంపై

అన్నతో పెళ్లి.. సొంత తల్లే అత్తగా మారి టార్చర్ పెట్టింది.. ఇక బిడ్డ పుట్టాక.. పాపం ఈ హీరోయిన్  కష్టాలపై సీరియల్ తీయొచ్చు..
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తానీ నటి జవేరియా అబ్బాసీ పర్సనల్ లైఫ్ ఎప్పుడూ చర్చనీయాంశమే. కారణం ఆమె స్టెప్ బ్రదర్‌ను పెళ్లి చేసుకుని.. సొంత తల్లినే అత్తగా మార్చుకుంది. 1997లో తన పదిహేడేళ్ల వయసులో షమూన్‌ను వివాహం చేసుకుని హెడ్ లైన్స్‌లో నిలిచింది. వీరిద్దరి బంధంపై అనేక విమర్శలు వచ్చాయి. కానీ కొందరు మాత్రం వారు బయోలాజికల్ సిస్టర్ అండ్ బ్రదర్ కాకపోవడంతో సమర్థించారు. పైగా సొంత తల్లి అత్తగా మారి కఠినంగా వ్యవహరించిందని.. మంచి కోడలుగా ఉంచేందుకు, సొసైటీ కోసం ఇలా చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది జవేరియా.

కానీ సమాజం తమను చూస్తున్న తీరు, మాట్లాడుతున్న మాటలు తట్టుకోలేక ఒత్తిడితో షమూన్‌కు విడాకులిచ్చింది. కానీ అప్పటికే జవేరియాకు అంజెలా పుట్టడంతో.. ఆమెను సింగిల్ మదర్‌గా పెంచింది. తను సంపాదించిన సంపాదనతోనే ఆమెను తీర్చిదిద్దింది. బిడ్డ సెటిల్ అయ్యాక 51 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంది. 2024లో బిజినెస్‌మ్యాన్ అడీల్ హైదర్‌ను వివాహం చేసుకుంది. ముఖ్యంగా కుమార్తె ప్రోత్సాహంతో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పుడు కూడా విమర్శలను ఎదుర్కొంది. కానీ తన అభిమానుల నుంచి మద్దతు, అత్తారింటి నుంచి ఆప్యాయత పొందింది.

Next Story