Abhishek Nama: విజయ్‌ను రూపాయి అడగలేదు.. మూడేళ్లు ఎదురుచూసిన నో రెస్పాన్స్

by Pulgam srinivas |

'వరల్డ్ ఫేమస్ లవర్' వల్ల భారీ నష్టం వచ్చినా విజయ్ దేవరకొండను ఒక్క రూపాయి కూడా అడగలేదని అభిషేక్ నామ వెల్లడించారు.

Abhishek Nama: విజయ్‌ను రూపాయి అడగలేదు.. మూడేళ్లు ఎదురుచూసిన నో రెస్పాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేసిన వారిలో అభిషేక్ నామ ఒకరు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ నామ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంపిణీదారుగా వ్యవహరించారు. ఈ సినిమా వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై స్పందిస్తూ, "మాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ద్వారా భారీ నష్టం వచ్చింది.

అయినప్పటికీ మేము విజయ్ దేవరకొండను ఒక్క రూపాయి కూడా అడగలేదు. అయితే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మా బ్యానర్‌లో మరో సినిమా చేస్తారని భావించాం. అందుకోసం దాదాపు మూడు సంవత్సరాలు ఎదురుచూశాం. కానీ ఇప్పటివరకు కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు" అని అన్నారు. ప్రస్తుతం అభిషేక్ నామ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్. రామారావు, కె.ఎ. వల్లభ నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థెరిసా హీరోయిన్లుగా నటించారు.

Next Story