Abhishek Agarwal : ది ఇండియా హౌస్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన అభిషేక్ అగర్వాల్

by Chukka Sudharani |   (  Updated:2025-09-01 15:52:06  IST  )

నిఖిల్ (Nikhil) నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీస్‌లో ‘ది ఇండియా హౌస్’ (The India House) ఒకటి.

Abhishek Agarwal : ది ఇండియా హౌస్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన అభిషేక్ అగర్వాల్
X

దిశ, సినిమా: నిఖిల్ (Nikhil) నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీస్‌లో ‘ది ఇండియా హౌస్’ (The India House) ఒకటి. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నర్మిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ అప్డేట్స్ మాత్రం రావడం లేదు. కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటున్నారు చిత్ర బృందం.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత అభిషేర్ అగర్వాల్ (Abhishek Agarwal) ఈ సినిమాపై షూటింగ్‌పై అప్డేట్ ఇచ్చాడు. ‘ది ఇండియా హౌస్ కథ విన్న తర్వాత రామ్ చరణ్ ఎంతో కనెక్ట్ అయ్యారు. వెంటనే ఈ సినిమాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 30% పూర్తి చేసాము.. మిగిలిన వర్క్ రెండు, మూడు నెలల్లో పూర్తవుతుంది.. ఇది మా బ్యానర్‌లో నిర్మించిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటి అవుతుందని మేము నమ్ముతున్నాము’ అని తెలిపారు.

Next Story