Abhilash: బైకర్‌ని ఆ సినిమాతో పోలుస్తారని నాకు ముందే తెలుసు

by Pulgam srinivas |

జెర్సీ, బైకర్ చిత్రాల మధ్య తండ్రి-కొడుకుల ఎమోషనల్ సన్నివేశాలను మినహాయిస్తే ఎలాంటి పోలికలు లేవని ఈ దర్శకుడు వివరణ ఇచ్చాడు.

Abhilash: బైకర్‌ని ఆ సినిమాతో పోలుస్తారని నాకు ముందే తెలుసు
X

దిశ, వెబ్ డెస్క్: లూసర్ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అభిలాష్ కంకర. ఈ దర్శకుడు తాజాగా శర్వానంద్ హీరోగా రూపొందిన ‘బైకర్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, రాజశేఖర్ కీలకమైన పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన విడుదలై ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అభిలాష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా, మీరు దర్శకత్వం వహించిన ‘బైకర్’ సినిమా, ‘జెర్సీ’ చిత్రానికి దగ్గరగా ఉందని, అందులోని ఎమోషన్—ఇందులోని ఎమోషన్ కాస్త సిమిలర్‌గా ఉన్నాయని ఓ టాక్ వచ్చింది. దాని గురించి మీరేమంటారు? అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది.

దానికి అభిలాష్ స్పందిస్తూ… తెలుగులో వచ్చిన గొప్ప స్పోర్ట్స్ చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. ఆ చిత్రం తండ్రి-కొడుకు ఎమోషన్‌తో రూపొందింది. మా సినిమాలో కూడా అలాంటి కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. అందువల్లే ‘బైకర్’, ‘జెర్సీ’ చిత్రాల మధ్య పోలికలు ఉన్నాయని అంటున్నారు. అది మినహాయిస్తే ఈ రెండు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి కంపారిజన్ వస్తుందనే విషయం కథ రాస్తున్నప్పుడే తనకు తెలుసని, అయితే అదే ఎమోషన్‌ను తాను పూర్తిగా భిన్నమైన విధానంలో ట్రీట్ చేశానని చెప్పారు. ఇక సినిమా కొంత ముందుకు వెళ్లిన తర్వాత ‘జెర్సీ’, ‘బైకర్’ చిత్రాల మధ్య ఎలాంటి కథ పరమైన పోలికలు ఉండవని ఆయన వివరణ ఇచ్చారు.

Next Story