బంగారు పూత పూసిన డ్రెస్‌లో మెరిసిపోయిన ఆషికా రంగనాథ్..!

by Pulgam srinivas |   (  Updated:2026-05-30 06:51:32  IST  )

పర్పుల్ ఔట్‌ఫిట్‌లో ఆషికా అందాల హంగామా

బంగారు పూత పూసిన డ్రెస్‌లో మెరిసిపోయిన ఆషికా రంగనాథ్..!
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ‘అమిగోస్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత ‘నా సామిరంగ’ చిత్రంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తొలి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ తన గ్లామర్‌తో కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆషికా.

సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరచూ తన స్టైలిష్ ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఆషికా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోల్లో ఆమె పర్పుల్ కలర్ డ్రెస్‌పై గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో మెరిసిపోయింది. హాట్ అందాలను హైలైట్ చేసేలా స్టైలిష్ ఫోజులు ఇస్తూ కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. అలాగే మెడలో అందమైన హారం ధరించి, కురులను ముందుకు వదిలేసి క్యూట్ లుక్‌తో మరింత ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీగా లైక్స్, కామెంట్స్ వస్తుండగా, నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆషికా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story