- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘అమీర్ లోగ్’ ఫస్ట్ లుక్ రిలీజ్
అవ్వల్ నెంబర్ ప్రొడక్షన్స్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 1గా ఓ చిత్రం రాబోతున్నది.

దిశ, సినిమా: అవ్వల్ నెంబర్ ప్రొడక్షన్స్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 1గా ఓ చిత్రం రాబోతున్నది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా.. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ అధికారికంగా ఆవిష్కరించారు. సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ‘అమీర్ లోగ్’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన అనంతరం నటుడు శ్రీ విష్ణు టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. రిలీజైన పోస్టర్ చూసినట్లు అయితే.. ముగ్గురు స్నేహతుల చుట్టూ తిరిగే ఓ వినోదాత్మకమైన కథ అని తెలుస్తోంది. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.






