- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయిపల్లవికి బంపర్ ఆఫర్...ఏకంగా బాలీవుడ్ హీరో కొడుకుతోనే !
సాయి పల్లవి ఖాతాలోకి బాలీవుడ్ సినిమా రాబోతుంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో ఓ సినిమా చేయబోతున్నారట సాయి పల్లవి.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే కానీ అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. మరికొంతమంది ఒకే ఒక్క సినిమాతో టాప్ మోస్ట్ హీరోయిన్ అయిపోతారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఫిదా లాంటి తెలంగాణ యాస, భాష నేపథ్యంలో వచ్చిన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు సాయి పల్లవి.
ఆ తర్వాత ఆమె సౌత్ ఇండియాను మొత్తం దున్నేశారు. ఇప్పటికి కూడా ఆమె టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే అలాంటి సాయి పల్లవి ఖాతాలోకి మరో బాలీవుడ్ సినిమా రాబోతుంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో ఓ సినిమా చేయబోతున్నారట సాయి పల్లవి. సునీల్ పాండే దర్శకత్వంలో ఈ సినిమా వస్తోందని చెబుతున్నారు.
ఈ సినిమాకు ఏక్ దిన్ అనే టైటిల్ మొదట అనుకొని ఇప్పుడు మేరే రహో అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను నవంబర్ 9వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉండగా డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ లో సాయి పల్లవి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే రామాయణ సినిమాలో కూడా ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.






