- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aamir Khan: ‘మహాభారతం’లో నాకిష్టమైన క్యారెక్టర్ అదే.. కుదిరితే ఆ పాత్రలోనే నటిస్తా.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan).. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ (Mahabharata)తో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan).. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ (Mahabharata)తో బిజీగా ఉన్నాడు. తన కలల ప్రాజెక్ట్(Dream project)గా రాబోతున్న ఈ సినిమాను ప్రారంభించడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీన్ ఖాన్ ‘మహాభారతం’ చిత్రం గురించే మాట్లాడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. అందులో తనకు ఇష్టమైన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు.
‘‘మహాభారతం’ తెరకెక్కించడం నా కల. ఇలాంటి చిత్రాలు ఎప్పటికీ నిరాశపరచవు. అయితే దీని కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ‘మహాభారతం’లో కృష్ణుడి (Krishna) పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అది నాకు చాలా ఇష్టమైన రోల్. అవకాశం వస్తే ఆ క్యారెక్టర్‌లో కనిపించాలనుకుంటున్నా. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడే దీని గురించి ఎలాంటి వివరాలు నేను చెప్పలేను. ఈ మూవీ కోసం ఓ టీంను సిద్ధం చేసే పనిలో ఉన్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో విషయాలపై అన్వేషిస్తున్నాము.. ఏం జరుగుతుందో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చారు.






