- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3ఇడియట్స్ సీక్వెల్‌పై అమీర్ ఖాన్ క్లారిటీ
అమీర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘3 ఇడియట్స్’. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు.

దిశ, సినిమా: అమీర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘3 ఇడియట్స్’. 2009లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇదే మూవీ పలు భాషల్లో కూడా రీమేక్ చేశారు. అంతటి ప్రజాదారణ ఉన్న ఈ చిత్రం సీక్వెల్‌పై ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన '3 ఇడియట్స్ 2' పై పనిచేస్తున్నారు. నేను ఆ కథను విన్నాను. అది బాగా వచ్చింది. స్క్రిప్ట్‌పై ఇంకా చాలా పని చేయాల్సి ఉంది, కానీ కథ చాలా బాగుంది. ఇందులో అదే హాస్యం, ఒక అసాధారణమైన కథ ఉన్నాయి. ఇది అదే '3 ఇడియట్స్' కథే, కానీ 10 సంవత్సరాల తర్వాత జరిగే కథ. త్వరలో నేను వర్క్ చేయబోయే సినిమాల్లో ఇది ఒకటి అనుకుంటున్నాను. ఈ సీక్వెల్ చేయడానికి నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.






