- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aamani: స్టాలిన్ చిత్రంలో కుష్బూ పాత్ర కోసం నన్ను అడిగారు.. ఆ ఒక్క కారణంతోనే చేయనని చెప్పాను
ఆమని తాజాగా మాట్లాడుతూ, చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో ఆయనకు సోదరి పాత్రలో అవకాశం రావడంతో ఆ ఆఫర్‌ను తాను రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన ఆమని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఎంతో మంది స్టార్ హీరోల పక్కన నటించి తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె చందమామ కథలు అనే మూవీతో రీ-ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన రీతిలో దూసుకుపోతోంది. ఈ సీనియర్ హీరోయిన్ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్‌లో కూడా నటిస్తూ బిజీగా కాలాన్ని గడుపుతోంది. తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా చిరంజీవి అంటే తనకు ఎంత ఇష్టం అనేది తెలియజేసింది. అలాగే స్టాలిన్ సినిమాలో తనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు రిజెక్ట్ చేసిందో కూడా క్లారిటీ ఇచ్చింది.
ఆమని మాట్లాడుతూ… “చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో నటించాలనే కోరిక నాకు ఎంతో కాలంగా ఉండేది. ఆయన మూవీలో హీరోయిన్గా అవకాశం వస్తే బాగుండేదని ఎంతోకాలం ఎదురు చూశాను. కానీ ఆ అవకాశం మాత్రం రాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి గారు హీరోగా రూపొందిన స్టాలిన్ చిత్రంలో ఖుష్బూ గారు చేసిన పాత్ర కోసం మొదట నన్నే మూవీ బృందం సంప్రదించింది. ఆ చిత్రంలో ఖుష్బూ, చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది. అలాంటి పాత్రలో అవకాశం వచ్చేసరికి, నేను ఎంతగానో ఇష్టపడే హీరో పక్కన హీరోయిన్గా నటించాలని అనుకున్నాను. అలాంటి వ్యక్తిని తమ్ముడు అని పిలవడం నాకు నచ్చలేదు. చిరంజీవి పక్కన నటించే అవకాశం రాకపోయినా పర్లేదు, కానీ సోదరి పాత్ర మాత్రం చేయకూడదనే ఉద్దేశంతో ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను” అని ఆమని తాజాగా చెప్పుకొచ్చింది.






