హిందూ-ముస్లిం ప్రేమకథగా 'సైరాబాను'.. క్లాప్ కొట్టిన కిరణ్ అబ్బవరం

by Chukka Sudharani |

ఆది సాయి కుమార్ కొత్త సినిమా పూజాకార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ అయ్యింది.

హిందూ-ముస్లిం ప్రేమకథగా సైరాబాను.. క్లాప్ కొట్టిన కిరణ్ అబ్బవరం
X

దిశ, సినిమా: ‘శంబాల’ చిత్రంతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న హీరో ఆది సాయి కుమార్, ఇప్పుడు స్ట్రాంగ్ కమర్షియల్, కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల వైపు దృష్టి పెడుతున్నారు. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఆయన ఈరోజు అధికారికంగా ప్రకటించారు. 'కె-ర్యాంప్' సంచలన విజయంతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్‌ దండా, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఆది సాయి కుమార్ సరసన బంధవి శ్రీధర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ‘సైరాబాను’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, ఆకట్టుకునే పోస్టర్ ద్వారా ఆవిష్కరించారు.

ఈ పోస్టర్ డిజైన్ ఉత్సాహభరితమైన రొమాంటిక్ వాతావరణాన్ని ప్రజెంట్ చేస్తోంది. సాఫ్ట్ పాస్టెల్ రంగులతో అద్దిన ఒక హార్ట్ షేప్ గులాబీ మేఘం, పోస్టర్ పైభాగంలో తేలుతున్నట్లుగా ఉంది. హిందూ-ముస్లిం ప్రేమకథను రూపొందుతోన్ ఈ ప్రాజెక్ట్ ఈరోజు పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టారు. దర్శకుడు రామ్ అబ్బరాజు, సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోన వెంకట్, కే రాంప్ డైరెక్టర్ నాని మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించారు. తొలి సన్నివేశానికి దర్శకుడు యోగి గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Next Story