Aadi Pinishetti: గట్టిగా పట్టుకోండి శబ్దం ట్రైలర్ రాబోతుంది.. పోస్టర్‌తో హైప్ పెంచేసిన చిత్ర బృందం

by Chukka Sudharani |

హీరో ఆది పినిశెట్టి (Aadi Pinishetti), దర్శకుడు అరివఝాగన్ (Arivajhagan) కాంబోలో వచ్చిన ‘వైశాలి’ (Vaishali)

Aadi Pinishetti: గట్టిగా పట్టుకోండి శబ్దం ట్రైలర్ రాబోతుంది.. పోస్టర్‌తో హైప్ పెంచేసిన చిత్ర బృందం
X

దిశ, సినిమా: హీరో ఆది పినిశెట్టి (Aadi Pinishetti), దర్శకుడు అరివఝాగన్ (Arivajhagan) కాంబోలో వచ్చిన ‘వైశాలి’ (Vaishali) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ (horror thriller) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ 2009లో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ ఆది, అరివఝాగన్ వీరిద్దరు అదే జానర్‌లో ‘శబ్దం’ (Shaddam) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. 7జీ ఫిలిమ్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ‘వైశాలి’కి కంటిన్యూషన్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.

ఆత్మల కారణంగా ఎదురయ్యే సంఘటన చుట్టూ ఈ చిత్రం తిరుగుతున్నట్లు టీజర్ (Teaser) చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమాలో ఆది ఆత్మల మీద రీసెర్చ్ చేసే పాత్రలో కనిపించనున్నాడు. ఇక వైశాలి సినిమాను మించి మంచి హిట్ కొట్టడమే టార్గెట్‌గా రూపొందుతున్న ‘శబ్దం’ నుంచి తాజాగా ట్రైలర్ (Trailer) అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘పులకరింతల సౌండ్ ఎక్కువవుతోంది! గట్టిగా పట్టుకోండి! శబ్దం ట్రైలర్ 19-02-2025 న రాబోతుంది. సౌండ్ థ్రిల్లర్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story