- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadi Pinishetti : ఆ సినిమా లేకుంటే ఈ రోజు శబ్దం ఉండేది కాదు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఆది పినిశెట్టి
హీరో ఆది పినిశెట్టి (Adi Pinishetti), దర్శకుడు అరివఝాగన్ (Arivajhagan) కాంబోలో ‘శబ్దం’

దిశ, సినిమా: హీరో ఆది పినిశెట్టి (Adi Pinishetti), దర్శకుడు అరివఝాగన్ (Arivajhagan) కాంబోలో ‘శబ్దం’ (Shabdam) సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో 2009లో వచ్చిన ‘వైశాలి’ (Vaishali) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ (Sequel)గా ‘శద్ధం’ మూవీ తెరకెక్కబోతుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ రెట్టింపు అయింది. 7జీ ఫిలిమ్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ (Teaser), ట్రైలర్ (Trailer)కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిరవ్వహించారు చిత్ర బృందం.
ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ‘‘శద్దం’ మూవీ ప్రయాణం 16 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యింది. ‘వైశాలి’ అనే సినిమా వలనే ఈ మూవీ స్టార్ట్ అయింది. వైశాలి లేకుంటే ఈరోజు శబ్దం కూడా ఉండేది కాదు. ఈ విషయంలో మా డైరెక్టర్ అరివఝాగన్‌ను ధన్యవాదాలు తెలపాలి. వైశాలి ఇప్పుడు చూసిన కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఈ సినిమాకి కథనే బలం. అంత నిజాయితీతో తీశాం. ఇప్పుడు అంతే నిజాయితీతో శబ్దం సినిమా తీసి.. మీ ముందుకు రాబోతున్నాము. నా కెరీర్‌లో ఈ చిత్రం చాలా స్పెషల్‌గా నిలిచిపోతుందంటూ. మీరు అందరూ సపోర్ట్ చెయ్యాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ మూవీలో లైలా (Laila), సిమ్రన్ (Simran), లక్ష్మీ మీనన్ (Lakshmi Menon), రెడిన్ కింగ్ స్లే తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.






