Marshal: ఫైనల్లీ కార్తీ సినిమాలో విలన్ ఫిక్స్.. ఆ నటుడు ఎంట్రీతో మరింత హైప్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్షల్’.

Marshal: ఫైనల్లీ కార్తీ సినిమాలో విలన్ ఫిక్స్.. ఆ నటుడు ఎంట్రీతో మరింత హైప్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్షల్’. ‘తానాక్కారన్’ ఫేమ్ డైరెక్టర్ తమిళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరీ రావు, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తికాగా.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో నటించే విలన్‌పై పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ఫస్ట్ కార్తీకి అపోజిట్ రోల్‌లో స్టార్ నటుడు నివిన్ పౌలీని ఫిక్స్ చెయ్యగా.. కొద్ది షూటింగ్ అనంతరం ఆయన తప్పుకున్నట్లు తెలుస్తుంది. డేట్స్ కుదరక ఈ సినిమా నుంచి నివిన్ పౌలీ తప్పుకోగా.. ఆయన ప్లేస్‌లో తమిళ స్టార్ జీవాను ఫిక్స్ చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే.. ఇప్పుడు ఫైనల్‌గా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్‌లో ఆదిపినిశెట్టిని ఫిక్స్ చేసినట్లు టాక్. ఇక ఇప్పటికే చర్చలు జరగ్గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అంతే కాకుండా.. పలు సినిమాల్లో విలన్ క్యారెక్టర్‌లో నటించిన తన నటనతో స్పెషల్ ఈమేజ్ సొంతం చేసుకున్న ఆది పినిశెట్టి.. ఇప్పుడు కార్తీ కోసం సిద్ధం అయ్యాడనే వార్తలు వైరల్ అవుతుండగా సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ కార్తీ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. లింక్


Next Story