- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవి సినిమాలో మరో యంగ్ హీరో...బాబీ ప్లాన్ అదుర్స్ !
సెకండ్ హాఫ్ లో 20 నిమిషాల పాటు చిరంజీవితో పాటు ఓ యంగ్ హీరో కనిపించబోతున్నాడట.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీని దున్నేశారు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి హిట్ అందుకోవడంతో.. రికార్డులు నమోదు అవుతున్నాయి. అయితే ఈ సినిమా సక్సెస్ కావడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన చిరంజీవి ఫోకస్ చేశారట. బాబీతో మెగాస్టార్ చిరంజీవి రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా తరహాలోనే.. తన సినిమాలో కూడా గెస్ట్ రోల్ పెట్టాలని బాబీ ప్రయత్నాలు చేస్తున్నారట. సెకండ్ హాఫ్ లో 20 నిమిషాల పాటు చిరంజీవితో పాటు ఓ యంగ్ హీరో కనిపించబోతున్నాడట. ఇప్పటికే తమిళ హీరో కార్తీ పేరు ఈ పాత్ర కోసం వినిపించినప్పటికీ..ఇప్పుడు తెలుగు కుర్ర హీరోను తీసుకోవాలని దర్శకుడు బాబీ ఆలోచన చేస్తున్నారట. ఈ పాత్ర మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో ఉండబోతుందట. మరి ఈ పాత్ర కోసం ఏ హీరోను తీసుకుంటారో చూడాలి. కాగా చిరంజీవి - బాబీ దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమా షూటింగ్ జనవరి చివరలో ప్రారంభం కానుంది.
మన శంకర వరప్రసాద్ సినిమాతో చిరు రికార్డ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార హీరో హీరోయిన్లుగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా పది రోజులు కాకముందే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడిందట. మొత్తంగా ఈ నెల అయిపోయే లోపు... 500 కోట్ల క్లబ్ లో చేరబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాల విక్టరీ వెంకటేష్ ఇరవై నిమిషాల పాటు స్పెషల్ రోల్ లో కనిపించారు. దాంతో సినిమాకు మంచి హైప్ వచ్చిందని అంటున్నారు.
Read More..






