ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి బాలీవుడ్ యంగ్ హీరో

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-14 14:23:40  IST  )

యంగ్ హీరో రోహిత్ సరాఫ్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ‘మహాకాళి’లో భాగమైనట్లు ప్రశాంత్ వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి బాలీవుడ్ యంగ్ హీరో
X

దిశ, సినిమా: ‘హనుమాన్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మహాకాళి’. ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుండి రాబోతుండగా.. పూజ అపర్ణ కొల్లూరి తెరకెక్కిస్తున్నారు. ఆర్.కె. దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ RKD స్టూడియోస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా, భారతీయ పురాణాలను, ఆధునిక సూపర్ హీరో ఎలిమెంట్స్‌ను కలిపి చూపిస్తుందని టాక్.

ఇందులో భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆయన ఈ చిత్రంలో ‘శుక్రాచార్యుడి’ పాత్రను పోషిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ హీరో రోహిత్ సరాఫ్ ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు ప్రశాంత్ వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయిందని టాక్. రోహిత్ రాకతో ఈ సినిమా కథలో ఒక కొత్త మలుపు రాబోతోందని తెలుస్తోంది.

సాయి పల్లవికి షాకిచ్చిన ‘రామాయణ’ టీమ్!

Next Story