సాయి పల్లవికి షాకిచ్చిన ‘రామాయణ’ టీమ్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-14 14:02:51  IST  )

సాయి పల్లవికి షాకిచ్చిన ‘రామాయణ’ టీమ్!
X

దిశ, సినిమా: నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆమె పోషిస్తున్న పాత్రకు మేకర్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల సాయి పల్లవి హిందీలో నటించిన ఫస్ట్ సినిమా ‘ఏక్ దిన్’. ఇందులో జునైద్ ఖాన్ సరసన నటించగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ సినిమాలో సాయి పల్లవి హిందీ డైలాగ్ డెలివరీ, ఆమె స్లాంగ్ పై నెటిజన్ల నుంచి కొంత విమర్శలు వచ్చాయి.

పౌరాణిక చిత్రమైన ‘రామాయణ’లో భాష చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండాలి. కాబట్టి సాయి పల్లవి హిందీ యాస సీత పాత్రలోని దైవత్వానికి లేదా గాంభీర్యానికి సరిపోకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారట. సాయి పల్లవి తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది. అయితే, సినిమా నాణ్యత, పాత్ర స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ తీసుకున్ని ఈ నిర్ణయం సాయి పల్లవి షాక్ అనే చెప్పాలి. అందుకు సాయి పల్లవి కూడా ఒప్పుకున్నట్లు టాక్. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ భారీ చిత్రం మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. రణబీర్ కపూర్ రాముడు, సాయి పల్లవి సీత, యష్ రావణుడు, సన్నీ డియోల్ హనుమంతుడు వంటి పాత్రలో కనిపించబోతున్నారు.

శర్వానంద్-శ్రీనువైట్ల సినిమాలో హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ!9

Next Story