అఖండ-2 సినిమా చూస్తూ.. పూనకంతో ఊగిపోయిన మహిళ

by velandi.Saikiran |

నందమూరి బాలయ్య చేసే శివతాండవ సన్నివేశాన్ని చూసిన ఆ మహిళకు పూనకం వచ్చింది.

అఖండ-2 సినిమా చూస్తూ.. పూనకంతో ఊగిపోయిన మహిళ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన తాజా సినిమా అఖండ 2. ఈ మూవీ డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయి థియేటర్లలో దుమ్ము లేపుతోంది. రూ. 80 కోట్లు ఇప్పటికే వసూలు చేసిన అఖండ 2, 100 కోట్లు క్రాస్ చేసే దిశగా దూసుకు వెళ్తోంది. హిందూ ధర్మం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఫ్యామిలీస్ ఈ సినిమాను చూసి ఆదరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖండ 2 సినిమా చూస్తుండగా అరుదైన సంఘటన జరిగింది. అఖండ 2 సినిమా చూస్తూ ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. క్లైమాక్స్ లో నందమూరి బాలయ్య చేసే శివతాండవ సన్నివేశాన్ని చూసిన ఆ మహిళకు పూనకం వచ్చింది. దీంతో ఆ మహిళ పూనకంతో ఊగిపోయిన వీడియో వైరల్ గా మారింది. ఆ మహిళకు పూనకం రావడంతో అక్కడే ఉన్న తోటి ప్రేక్ష‌కులు ఉలిక్కిప‌డ్డారు. కాగా తాజాగా ఈ అఖండ 2 సినిమా చూసేందుకు అఘోరాలు కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. క్లిక్

Next Story