ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వీడియో.. ఉస్తాద్ భగత్ సింగ్‌ సెట్స్‌లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-11 14:15:44  IST  )

ప‌వ‌న్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) క‌మిటైన చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”(Usthad Bhagat Singh) ఒకటి.

ఫ్యాన్స్‌కు  పూనకాలు తెప్పించే వీడియో.. ఉస్తాద్ భగత్ సింగ్‌ సెట్స్‌లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: ప‌వ‌న్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) క‌మిటైన చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”(Usthad Bhagat Singh) ఒకటి. దీనికి హరీష్ శంకర్(Hareesh Shankar) దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా అదిరిపోయే వీడియో షేర్ చేసింది.. ఇక దీనికి ‘ఇస్ బార్ సిర్ఫ్ ఆంధీ నహిన్, తూఫాన్ హై.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో చేరారు.. షూటింగ్ పురోగతిలో ఉంది. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి.’ అని రాసుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇక వీడియోలో పవన్ కళ్యాణ్ స్టైలీష్‌గా కారులోంచి దిగి ఫ్లవర్ బొకే అందుకుని లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత హరీష్ తనకు సీన్స్ వివరిస్తుండగా క్యూట్‌గా స్మైల్ చేస్తున్నాడు. అయితే తన పక్కనే శ్రీలీల కూడా ఉన్నది. అలాగే గన్ పట్టుకుని పవర్ స్టార్ అలా ఇలా తిప్పుతూ ఉన్నాడు. ఇక ఫైనల్‌గా ‘హట్.. సాలే’ అంటూ పవన్ చెప్పే డైలాగ్‌కి పూనకాలు అంతే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story