- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూవీలో నా ఒక్క సీన్‌తో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు: పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఇంట్రెస్టింగ్ పోస్ట్
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక పవన్‌తో విడాకుల తర్వాత తన పిల్లలను బాధ్యలను చూసుకుంటూ లైఫ్‌ను లీడ్ చేస్తుంది. ప్రజెంట్ ‘బ్యాడ్ గర్ల్స్’(Bad Girlz) అనే మూవీలో నటిస్తోంది. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం.
అయితే దీనికి ఫణీ ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలీ నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ(Instagram Story) పెట్టింది.
ఇందులో భాగంగా ‘బ్యాడ్ గర్ల్ మూవీలో నేను ఒకే ఒక్క సీన్ చేశాను.. కానీ డైరెక్టర్ ప్రదీప్ ధూళిపూడి నా ఒక్క సీన్‌తో ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు.. ఎంటైర్ బ్యాడ్ గర్ల్స్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
త్రిష ప్రభాస్ పెళ్లి చేసుకున్నారా..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన రిసెప్షన్ ఫొటోస్






