- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ.. మూడు రోజుల్లో కింగ్డమ్ మూవీకు ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తాజాగా నటించిన ‘కింగ్డమ్’(Kingdom) చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తాజాగా నటించిన ‘కింగ్డమ్’(Kingdom) చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. అయితే ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే(Bhagyasree Borse) హీరోయిన్‌గా నటించగా.. సత్యదేవ్(Sathyadev) కీలక పాత్రలో నటించారు.
కాగా ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందించారు. అయితే భారీ అంచనాలతో జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. తాజాగా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.67 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Link






