OTT Movie: వణుకుపుట్టించే క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది.. క్లైమాక్స్ చూస్తే రెండు రోజులు నిద్ర పట్టదు.. ఎక్కడ చూడొచ్చంటే?

by Phanindra |

తక్కువ బడ్జెట్ తో మన ముందుకొచ్చిన మూవీ రూ.60 కోట్ల వరకు రాబట్టింది

OTT Movie: వణుకుపుట్టించే  క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది..  క్లైమాక్స్ చూస్తే రెండు రోజులు నిద్ర పట్టదు.. ఎక్కడ చూడొచ్చంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మలయాళంలో హీరోయిన్ నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హీరో బాసిల్ జోసెఫ్ కి ఎలాంటి ఇమేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో 'సూక్ష్మదర్శిని' మూవీ తెరకెక్కింది. 2024 నవంబర్ 22 న థియేటర్లకు ఈ మూవీ వచ్చింది. తక్కువ బడ్జెట్ తో మన ముందుకొచ్చిన మూవీ రూ.60 కోట్ల వరకు రాబట్టింది. ఈ నెల 11వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ఆలోచనల్లో చాలా మార్పు మారింది. స్టోరి మంచిగా ఉంటే ప్రజలు ఆదరిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘సూక్ష్మదర్శిని’ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రస్తుతం, తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో ఉండే మిస్టరీ, థ్రిల్లర్ సీన్స్ ప్రేక్షకులును బాగా ఆకట్టుకున్నాయి. అయితే, ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని చాలామంది ఎదురు చూశారు. వారిలో తెలుగు ఆడియెన్స్ కూడా ఉన్నారు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నజ్రియా ఆసక్తి చూపుతుంది. హీరో చేసే పనులు ప్రియదర్శనిలో (నజ్రియా) లో మరింత అనుమానం పెంచుతాయి. ఈ కథలో క్లైమాక్స్ హైలెట్ ? వారిద్దరి మధ్య జరిగే థ్రిల్లర్ సీన్స్ భయంకరంగా ఉంటాయి. దీనిని చూస్తే రెండు రోజులు వరకు నిద్ర పట్టదు. మరి,మీరు కూడా చూసేయండి.

Next Story