- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాంకర్ అనసూయ కోసం గుడి..ఎక్కడంటే ?
ఓ యూట్యూబ్ ఛానల్ కు తాజాగా అనసూయ అభిమాని మురళి శర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ అనసూయ కోసం గుడి కట్టబోతున్నట్లు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. నటుడు శివాజీ చేసిన కామెంట్ల తర్వాత అనసూయ గురించి పంచాయతీ కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో యాంకర్ అనసూయ కోసం గుడి కట్టబోతున్నట్లు సంచలన ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు ఆమె అభిమాని అంటూ చెప్పుకునే తిరిగే మురళి శర్మ. నటుడు శివాజీ చేసిన కామెంట్ల నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మా శరీరం మా ఇష్టం.. ఎలాంటి బట్టలు వేసుకుంటే నీకేంటి ? నొప్పి అన్న రేంజ్ లో అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో అనసూయ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కాంగ్రెస్ కు చెందిన ఓ మహిళ నేత కూడా ఫైర్ అయ్యారు. ఈ గ్యాప్ లో అనసూయ అభిమాని అంటూ మురళి శర్మ రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడిని అంటూ చాలా మీడియాలో హైలెట్ అయ్యాడు మురళీ శర్మ. ఇప్పుడు ఆయనే గుడి కడతానని ప్రకటన చేశాడు.
అనసూయ కోసం ప్రత్యేకంగా గుడి ?
ఓ యూట్యూబ్ ఛానల్ కు తాజాగా అనసూయ అభిమాని మురళి శర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ అనసూయ కోసం గుడి కట్టబోతున్నట్లు వెల్లడించారు. కుష్బూ, సమంతకు ఉన్నట్లుగానే యాంకర్ అనసూయకు కూడా గుడి కడతామన్నారు. అభిమానులందరూ ఏకమై ఓ నిర్ణయానికి వచ్చి ఎక్కడ కట్టాలని దానిపైన నిర్ణయం తీసుకుంటామని కూడా వెల్లడించారు. దీనికి ప్రభుత్వం సహాయాన్ని కూడా ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మురళి శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.






