అతడు రీ రిలీజ్ సీడెడ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ

by Pulgam srinivas |

అతడు మూవీ రీ రిలీజ్ సీడెడ్ హక్కులను ధనుష్ ఫిలిప్స్ సంస్థ దక్కించుకుంది.

అతడు రీ రిలీజ్ సీడెడ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రిష హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అతడు సినిమాని 2005లో విడుదల చేశారు. ఇందులో సోను విలన్ పాత్రలో నటించగా, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు. కానీ ఆ తర్వాత ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మధ్యకాలంలో మహేష్ నటించిన చాలా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో అనేక చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.



అతడు సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరి 28వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మహేష్ చిత్రాలకు రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లు వస్తుండడంతో ఆయన సినిమాలను విడుదల చేయడానికి అనేకమంది డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. ఇక అతడు డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం కూడా పెద్ద స్థాయిలో పోటీ జరిగినట్లు తెలుస్తుంది. ఈ పోటీలో సీడెడ్ హక్కులను ధనుష్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా ద్వారా ధనుష్ ఫిలిమ్స్ సంస్థ వారు సీడెడ్ ఏరియాలో ఏ స్థాయి లాభాలను అందుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Next Story