- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sankranthiki Vasthunam: ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు.. కానీ, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు.. వెంకీ దెబ్బ .. టాలీవుడ్ అబ్బా!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) హీరోగా " సంక్రాంతికి వస్తున్నాం"

దిశ, వెబ్ డెస్క్ : అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) హీరోగా " సంక్రాంతికి వస్తున్నాం" ( Sankranthiki Vasthunam ) మూవీ కూడా జనవరి 14న ఆడియెన్స్ ముందుకొచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ తో దూసుకువెళ్తుంది. ముఖ్యంగా, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అలరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.131 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఫస్ట్ డే ఈ మూవీ రూ.45 కోట్ల గ్రాస్‌ను సాధించి వెంకటేష్ సినీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసింది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్లు కలెక్ట్ చేయగా.. నాలుగో రోజు రూ.25 కోట్లు వసూలు చేసింది. ఇక పోతే, నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.131 కోట్లు రాబట్టినట్లు మూవీ టీం ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది.
ఇక రెండు రోజులు సెలవులు ఉండటంతో వసూళ్లు భారీగా పెరిగే అవకాశం సినీ వర్గాల చెబుతున్నారు. వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.






