- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భైరవం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. పవర్ ఫుల్ లుక్‌లో ముగ్గురు హీరోలు
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్, నారా రోహిత్ కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’(Bhairavam).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్, నారా రోహిత్ కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో జయసుధ కీలక పాత్రలో నటిస్తుంది. ఇందులో ఆనంది, అదితి శంకర్(Aditi Shankar), దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్(Sri Sathya Sai Arts) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే భైరవం నుంచి ముగ్గురు హీరోలు, హీరోయిన్ల పోస్టర్లు విడుదలై భారీ హైప్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవగా పోస్ట్ ప్రొడక్షన్ (Post Production)పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా, భైరవం టీజర్ జనవరి 20న విడుదల కాబోతున్నట్లు సాయి శ్రీనివాస్ xద్వారా ప్రకటించారు. అంతేకాకుండా ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేసి మూవీపై అంచనాలను రెట్టింపు చేశాడు. ఇందులో ఓ గుడి దగ్గర సాయి, మనోజ్, రోహిత్ బొట్టు పెట్టుకుని ఒళ్లంతా కుంకుమతో ఉగ్రరూపంలో కనిపించారు. ఇక అది చూసిన నెటిజన్లు ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురిని చూస్తుంటే.. ‘భైరవం’ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్ధమవుతుందని అంటున్నారు.
Read More..
Vijay Sethupathi: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘విడుదల-2’.. ఎందులో చూడొచ్చంటే?






