‘తుఫాను సెట్స్‌లోకి అడుగుపెట్టబోతుంది’.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతుందంటూ ట్వీట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-31 08:45:12  IST  )

ప‌వ‌న్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) క‌మిటైన చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”(Usthad Bhagat Singh) ఒకటి.

‘తుఫాను సెట్స్‌లోకి అడుగుపెట్టబోతుంది’.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతుందంటూ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప‌వ‌న్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) క‌మిటైన చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”(Usthad Bhagat Singh) ఒకటి. దీనికి హరీష్ శంకర్(Hareesh Shankar) దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ‘గ‌బ్బ‌ర్ సింగ్’(Gabbar Singh) చిత్రం త‌ర్వాత హ‌రీష్‌, ప‌వ‌న్ కాంబోలో రూపొందుతున్న‌ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ వ‌స్తున్న టైంలో ఇటీవ‌ల క‌లియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ద‌ర్శించుకున్న హరీశ్ శంకర్ జూన్ రెండవ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలియ‌జేశారు. దీంతో ప‌వ‌న్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు.

ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.. ‘ఆంధీ(గాలి తుఫాను) ఈజ్ బ్యాక్ ఆన్ సెట్స్.. వేచి చూస్తూ ఉండండి.. 2.07 నిమిషాలకు ఊహించని అప్‌డేట్ రాబోతుంది’ అని రాసుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ సెట్స్‌లో జాయిన్ అవుతారని టాక్. అయితే ఈ షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు జరగనుందట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత సేపు వెయిట్ చేయాల్సిందే.

Next Story