- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్, రాజమౌళి సినిమా సినిమా కోసం ప్రత్యేక సెట్.. ఏకంగా 50 కోట్లతో !
టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్ కాంబినేషన్ లో బడా మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్ కాంబినేషన్ లో బడా మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో... నటీనటులు ఇంకా ఫైనల్ కాలేదు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
విదేశాల్లో ఎక్కువగా ఈ సినిమా షూట్ జరిగే ఛాన్స్ లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీ లో... షూటింగ్ జరుపుకునేందుకు సిద్ధం అవుతోందట. ఈ మేరకు చిత్ర బృందం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొత్త ప్రచారం జరుగుతోంది. అయితే రామోజీ ఫిలిం సిటీ లో... మహేష్ బాబు, జక్కన్న కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం... ప్రత్యేక సెట్ ఏర్పాటు చేయబోతున్నారట.
సినిమా అయిపోయే వరకు ఆ సెట్ అక్కడే ఉంటుందని తెలుస్తోంది. దీనికోసం 50 నుంచి 55 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నారు. అచ్చం వారణాసి తరహాలో... రామోజీ ఫిలిం సిటీ లో అతి పెద్ద సెట్ నిర్మించబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సెట్ లోనే సినిమా దాదాపు కొనసాగుతుందని చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






