చిరు పోడ్‌కాస్ట్.. సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి అన్ని వివరాలు అక్కడే

by Pulgam srinivas |

కథా రచయిత బి.వి.ఎస్. రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి గారు ‘చిరు పోడ్‌కాస్ట్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు, అది త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు ఈయన వెల్లడించారు.

చిరు పోడ్‌కాస్ట్.. సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి అన్ని వివరాలు అక్కడే
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకోవడమే కాకుండా ఇప్పటికీ అదే స్థాయిలో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి సుదీర్ఘ సినీ ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న ఎత్తుపల్లాల గురించి కొంతవరకు ప్రజలకు తెలిసిందే. అయితే తన జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి చిరంజీవి త్వరలో ఓపెన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా దర్శకుడు, కథా రచయిత బి.వి.ఎస్. రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రయాణం, ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, సంతోషాలు, వ్యక్తిగత అనుభవాలు వంటి అనేక విషయాలను ప్రజలతో పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం ‘చిరు పోడ్‌కాస్ట్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు, అది త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు రవి వెల్లడించారు. ఈ పోడ్‌కాస్ట్‌లో చిరంజీవి తన సినీ ప్రస్థానంలో జరిగిన ఎన్నో ఆసక్తికర సంఘటనలు, తెలియని విషయాలను అభిమానులతో పంచుకోనున్నట్లు చెప్పారు. ఇలా చిరంజీవి తన జీవిత విశేషాలను చెప్పేందుకు ప్రత్యేకంగా పోడ్‌కాస్ట్ షో నిర్వహించబోతున్నారనే వార్త బయటకు రావడంతో, మెగా అభిమానులు దీనిపై భారీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story