- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhagyashree Borse: బర్త్‌డే స్పెషల్ ట్రీట్.. భాగ్యశ్రీ బోర్సే సినిమాల నుంచి వరుస అప్‌డేట్స్
ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) ఒకరు.

దిశ, సినిమా: ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) ఒకరు. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో ఎంతో మంది యూత్‌ను తనవైపు తిప్పుకుంది. దీంతో ప్రజెంట్ వరుస ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరుగా దూసుకుపోతుంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ పోతునేని (Ram Pothuneni) ‘RAPO22’లో.. అలాగే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘కింగ్‌డమ్’తో పాటు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ‘కాంత’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే.. ఈ రోజు భాగ్యశ్రీ బోర్సే పుట్టిన రోజు కావడంతో ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా లుక్స్ రిలీజ్ చేస్తూ... ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు ‘RAPO22’, ‘కింగ్‌డమ్’, ‘కాంత’ సినిమాల నుంచి లుక్స్ రిలీజ్ చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్టర్లు షేర్ చేశారు. అందులో భాగ్యశ్రీ బోర్సే క్యూట్ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.






