- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాప్ సినిమాకి సీక్వెల్
‘ది సబర్మతి రిపోర్ట్’కు సీక్వెల్‌గా ‘ది టెర్రర్ రిపోర్ట్’… అధికారిక ప్రకటన వచ్చేసింది.

దిశ, వెబ్ డెస్క్: 2024లో విడుదలైన ది సబర్మతి రిపోర్ట్ చిత్రం ఆ సమయంలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే హీరోగా నటించగా, రాశి ఖన్నా హీరోయిన్‌గా కనిపించింది. ధీరజ్ సర్ణా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా 2002లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ దహనం ఘటన నేపథ్యంలో తెరకెక్కింది. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.30 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించి కమర్షియల్‌గా ఫెయిల్యూర్‌గా నిలిచింది.
సాధారణంగా ప్లాప్ అయిన సినిమాలకు మేకర్స్ సీక్వెల్స్ ప్లాన్ చేయడం అరుదుగా కనిపిస్తుంది. అయితే ది సబర్మతి రిపోర్ట్ మూవీ బృందం మాత్రం సీక్వెల్‌తో ముందుకు రావాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ది టెర్రర్ రిపోర్ట్ అనే సినిమాను రూపొందించనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సీక్వెల్‌కు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్‌లు తమ నిర్మాణ సంస్థలు బాలాజీ టెలిఫిలిమ్స్ మరియు ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు సమాచారం.






