Horror Movie: ఆ హర్రర్ సినిమాను థియేటర్లలో ఒంటరిగా చూస్తే 5 లక్షలు.. ఏం చిత్రమంటే?

by Vennela |

Horror Movie: ఈ మధ్య కాలంలో సినిమా ప్రపంచంలో హర్రర్ మూవీ(Horror Movie)స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.

Horror Movie: ఆ హర్రర్ సినిమాను థియేటర్లలో ఒంటరిగా చూస్తే 5 లక్షలు.. ఏం చిత్రమంటే?
X

దిశ, వెబ్ డెస్క్: Horror Movie: ఈ మధ్య కాలంలో సినిమా ప్రపంచంలో హర్రర్ మూవీ(Horror Movie)స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళలో ఎన్నో అద్బుతమైన హార్రర్ థ్రిల్లర్లు(Horror thrillers) వచ్చాయి. కానీ ఒక సినిమాని థియేటర్లలో ఒంటరిగా చూస్తే రూ.5 లక్షలు ఇస్తామని మేకర్స్ పేర్కొన్నారు. అది ఏ సినిమానో తెలుసా?

హారర్ సినిమా(Horror Movie)లు అంటేనే భయమేస్తుంది. అలా అని చూడకుండా మానేస్తామా. వెతుక్కని మరీ చూస్తుంటాం. ఓ పక్క భయపడుతూనే..మూవీని ఎంజాయ్ చేయడమంటే చాలా ఇష్టం. ఇలా అందర్నీ భయపెట్టి, ఫేవరెట్ మూవీస్ లిస్టులో చేరిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఫూంక్ 2(Phoonk 2). ఈ మూవీ 2010లో విడుదలైంది. ఈ మూవీకి రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. మిలింద్ గడ్గ్కర్(Milind Gadkkar) ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా విడుదల సమయంలో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఓ సంచలన వ్యాఖ్య చేశారు.

ఈ సినిమాను ఎవరైనా థియేటర్లలో ఒంటరిగా చూస్తే వారికి రూ. 5లక్షల ప్రైజ్ మనీ ఇస్తానని ప్రకటించారు. అయితే ఈ సినిమా చూసే ముందు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఈ సినిమా చూసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తులకు ముందుగా ఈసీజీ(ECG) టెస్ట్ చేశారు. ఎందుకంటే ఆ సినిమా చూసే ధైర్యం ఆ వ్యక్తులకు ఉందా లేదని పరీక్షించారు. ఇందుకోసం వైద్యుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఆర్జీవీ తీసిన ఈ ఫూంక్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడింది. సినిమాకు ఎంత ప్రమోషన్ ఇచ్చినా..థియేటర్లలోకి వచ్చి మూవీ చూసేందుకు జనం ఆసక్తి చూపించలేదు. మీరు ఫూంక్ 2(Phoonk 2) కూడా చూడాలని ప్లాన్ చేస్తుంటే, OTT ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో సౌత్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, అహ్సాస్ చన్నా, అమృత ఖాన్విల్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Next Story