- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ ‘పెద్ది’కి అరుదైన రికార్డు.. ఆస్ట్రేలియాలో ఫస్ట్ ఎవర్ ప్రీమియర్!
జూన్ 3 రాత్రి 11:45 గంటలకు మెల్‌బోర్న్‌లోని IMAX థియేటర్‌లో ‘పెద్ది’ ప్రీమియర్ షో ఘనంగా జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇకపోతే ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుండగా, జూన్ 3 రాత్రి నుంచే ప్రీమియర్ షోలను భారీ స్థాయిలో ప్రదర్శించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్‌ను చిత్ర బృందం వెల్లడించింది.
ఆస్ట్రేలియాలో ‘పెద్ది’ చిత్రానికి ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో తొలి పాన్ ఇండియా తెలుగు ప్రీమియర్ షోగా ఈ మూవీ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోనుంది. ఈ ప్రీమియర్ షో జూన్ 3 రాత్రి 11:45 గంటలకు మెల్‌బోర్న్‌లోని IMAX థియేటర్‌లో ఘనంగా జరగనున్నట్లు వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియాలో ‘పెద్ది’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌ను ప్రకటించడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.






