- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త చిత్రాలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలోకి మరో కొత్త సినిమా వచ్చేసింది. మరి ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో వచ్చిన సినిమా ‘గేమ్ ఛేంజర్’(Game Changer). కియారా అద్వాని(Kiara Advani) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అలాగే కలెక్షన్ల విషయంలోనూ ఓకే ఓకే అనిపించుకుంది. అటు సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam), ‘డాకు మహారాజ్’(Daku Maharaj) చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలవడంతో ఈ మూవీకి ప్రేక్షకాదరణ తగ్గింది. ఫలితంగా ఈ మూవీ కమర్షియల్‌గా డిజాస్టర్ అయ్యింది.
కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో నేటి నుంచి (ఫిబ్రవరి 7) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ తెలిపారు. ఇక రిలీజ్ అయి నెలరోజులు కూడా కాకముందే ఈ చిత్రం ఓటీటీలోకి రావడంతో ఓటీటీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






