కొత్త జన్మ స్టార్ట్ కాబోతోంది.. మంచు మనోష్ కీలక వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-19 15:59:01  IST  )

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్, నారా రోహిత్(Nara Rohit) మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం(Bhairavam) టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది.

కొత్త జన్మ స్టార్ట్ కాబోతోంది.. మంచు మనోష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్, నారా రోహిత్(Nara Rohit) మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం(Bhairavam) టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అలాగే మే 20 మంచు మనోజ్(Manchu Manoj) బర్త్ డే. ఈ నేపథ్యంలో మనోజ్ మంచు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘గజపతి వర్మ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. చాలా ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ క్యారెక్టర్. భైరవం తప్పకుండా నా కెరియర్ లో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. తొమ్మిదేళ్లయింది సినిమాలకి దూరమై. కొన్ని కారణాల వల్ల బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్లీ ఈ మూవీతో ప్రేక్షకులు ముందుకు రావడం వెరీ ఎమోషనల్ మూమెంట్.

ఇందులో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరి స్క్రీన్ స్పేస్ వారిదే, ప్రతి ఒక్కరూ ఫెంటాస్టిక్‌గా పెర్ఫార్మ్ చేశారు. డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా రాశారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సాయి నాకు తమ్ముడు లానే వాడు. రోహిత్(Nara Rohit) నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమా వలన మీ ముగ్గురు ఎక్కువ టైం స్పెండ్ చేసాము. కాబట్టి మా మధ్య బాండింగ్ మరింత పెరిగింది. నా పర్సనల్ లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా షూటింగ్‌కి ఇబ్బంది కలగకుండా జెట్ స్పీడ్‌లో చేసుకుంటూ వెళ్ళాం. ఇది కూడా రోహిత్ నుంచి ఇన్స్పిరేషన్‌గా వచ్చింది. ఇందులో సాంగ్ చేస్తున్న సమయంలో ఆయన కుటుంబంలో ఒక విషాదం చోటుచేసుకుంది.

ఆ బాధలోనే షూటింగుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా పాటని ఫినిష్ చేశారు. రియల్లీ హాట్సాఫ్. డైరెక్టర్ విజయ్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్‌లా అయిపోయారు. నమ్మినోల్ని బాగా చూసుకోవడం, పదిమందికి హెల్ప్ చేయడం. ఆయన కష్టపడుతూ పైకి వచ్చారు. ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాయితీగా ఉండడం ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నాను. నాకు మా ఫాదరే హీరో. నేను బిగినింగ్ నుంచి చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేశాను. భవిష్యత్తులో కొత్త రకం సినిమాలు చేయాలని ఉంది. అలాగే పిల్లల కోసం ఒక మూవీ చేయాలనుంది. ఎప్పుడైనా అవకాశం వస్తే అలాంటి ఒక సినిమా చేస్తాను. ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ స్టార్ట్ కాబోతోంది’’ అని చెప్పుకొచ్చారు.

Next Story