- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశాంత్ నీల్ సమర్పణలో సరికొత్త హారర్ మూవీ స్టార్ట్..
బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రియేటివ్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు.

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రియేటివ్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. యంగ్ టాలెంట్స్‌తో రాబోతున్న ఈ సరికొత్త హారర్ మూవీలో సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. కీర్తన్ నాదగౌడ డైరెక్ట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. చిత్రబృందం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని మూవీ ప్రారంభాన్ని సెలబ్రేట్ చేసింది. గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్‌లో జరిగే భయానక సంఘటనల చుట్టూ కథ తిరుగనుందని తెలుస్తుండగా.. సైన్స్, మిస్టరీ, మూఢనమ్మకాల నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నామని చెబుతున్నారు మేకర్స్. కొత్త తరహా హర్రర్ కథ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా మంచి సర్‌ప్రైజ్ ఇవ్వనుందని హామి ఇస్తున్న మేకర్స్.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని ఈ సందర్భంగా తెలిపారు.
- Tags
- Prashanth Neel






