‘నాగబంధం’ టీమ్‌కు కొత్త సవాల్

by Pulgam srinivas |

‘నాగబంధం’, ‘రావు బహదూర్’ చిత్రాలు రెండూ కూడా జూలై 3వ తేదీన విడుదల కానున్నాయి.

‘నాగబంధం’ టీమ్‌కు కొత్త సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘నాగబంధం’ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే విడుదల తేదీ ప్రకటించిన తర్వాత చాలా కాలం వరకు ఈ సినిమాకు పెద్దగా పోటీ కనిపించలేదు. కానీ తాజాగా సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘రావు బహదూర్’ కూడా అదే రోజున విడుదల కానుండటంతో ఆసక్తికర పోటీ నెలకొంది. మొదట ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయాలని భావించిన మేకర్స్, జూన్ 4న ‘పెద్ది’ విడుదల ఉండటంతో తేదీని జూలై 3కు మార్చారు. ‘రావు బహదూర్’ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ సినిమాపై కూడా మంచి బజ్ ఏర్పడింది. దీంతో జూలై 3న విడుదల కానున్న ఈ రెండు చిత్రాల్లో ఏది బాక్స్ ఆఫీస్ వద్ద మెరుగైన టాక్ సొంతం చేసుకుంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

Next Story