సిద్దు జొన్నలగడ్డతో వర్క్ చేయడం ఎలా ఉందని అడిగిన నెటిజన్.. బేబీ రియాక్షన్ ఇదే.. (పోస్ట్)

by Gugulothu.Kavitha |

యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సిద్దు జొన్నలగడ్డతో వర్క్ చేయడం ఎలా ఉందని అడిగిన నెటిజన్.. బేబీ రియాక్షన్ ఇదే.. (పోస్ట్)
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’(Software Developer) వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీకి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ‘బేబీ’(Babe) మూవీలో నటించి తన యాక్టింగ్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ప్రస్తుతం స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘జాక్’(Jack) మూవీలో నటిస్తోంది. ఇక ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అయితే వైష్ణవి చైతన్య సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వైష్ణవి ‘ఆస్క్ మి క్వష్చన్’ అనే గేమ్‌లో భాగంగా తనని ఎవరైన ప్రశ్నలు అడగవచ్చు అని పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమకు నచ్చిన ప్రశ్నలు వేస్తూ జవాబులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో వర్క్ చేయడం ఎలా ఉంది’ అని అడగగా దానికి వైష్ణవి.. ‘అతనితో వర్క్ చేయడం చాలా గ్రేట్‌గా భావిస్తున్నా. సిద్ధూ.. వర్సటైల్ యాక్టర్, అండ్ ఆల్ రౌండర్. జోక్స్ కూడా బాగా చేస్తాడు. అండ్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అతను నిజంగా స్టార్ బాయ్ సిద్ధూనే’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story