'రాబిన్ హుడ్' నుంచి లవ్ సాంగ్ వచ్చేసిందోచ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

by I. Sairam |   (  Updated:2025-08-26 16:50:55  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood).

రాబిన్ హుడ్ నుంచి లవ్ సాంగ్ వచ్చేసిందోచ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుంచి సెకెండ్ సింగిల్ అయినటువంటి ‘గుచ్చి గుచ్చి చూడొద్దే’ అనే సాంగ్ లవర్స్ డే కానుకగా రిలీజ్ అయింది.

అయితే ఈ సాంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం విశేషం. కాగా ‘గుచ్చి గుచ్చి చూడొద్దే’ అంటూ స్టార్ట్ అయ్యే ఈ పాటని కృష్ణకాంత్(Krishna Kanth) రచించగా, జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) స్వరపరిచారు. అర్మాన్ మాలిక్(Armaan Malik) ఆలపించారు. కాగా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. ఇక సెకెండ్ సింగిల్ కూడా అంతే జోష్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్‌ను ఇక్కడ వినేయండి.

ఇక హీరో నితిన్ విషయానికి వస్తే.. ‘జయం’(Jayam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ హీరోగా రాణిస్తున్నాడు. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ లీల విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో 5 పైగా సినిమాలు ఉన్నాయి.

Click For Video ....

Next Story