ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. తెలుగు సినిమాకు పుట్టినరోజు వేడుకలు

by Gantepaka Srikanth |

తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు(Film Chamber Awards) ఇవ్వాలని నిర్ణయించింది.

ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. తెలుగు సినిమాకు పుట్టినరోజు వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు(Film Chamber Awards) ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6వ తేదీన ప్రతీ సంవత్సరం తెలుగు సినిమా(Telugu Cinema) పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతోపాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని పేర్కొన్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna)కు అప్పగించారు. అనంతరం ఈ సమావేవంలో పాల్గొన్న మురళీమోహన్(Murali Mohan) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతల కంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ అని అన్నారు. రాజకీయ నేతలకు పదవీకాలం పూర్తయితే ప్రజల్లో ఆదరణ ఉండదు.. కానీ సినిమా వాళ్ల విషయంలో ప్రజలు అలా ఉండరు అని తెలిపారు. మద్రాసులో ఉన్నప్పుడు తమది సినిమా కులమని గర్వంగా చెప్పుకునే వాళ్లమని గుర్తుచేశారు.

Next Story