Hit-3 : హిట్-3 మూవీకి భారీ షాక్.. HD ప్రింట్ లీక్

by Muthe.Rajitha |

హీరో నాని(Nani) నటించిన తాజా చిత్రం హిట్-3(Hit-3) మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

Hit-3 : హిట్-3 మూవీకి భారీ షాక్.. HD ప్రింట్ లీక్
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో నాని(Nani) నటించిన తాజా చిత్రం హిట్-3(Hit-3) మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంటున్న ఈ మూవీకి భారీ షాక్ తగిలింది. రిలీజై 24 గంటలు కూడా గడవక ముందే పైరసీ(Piracy) భూతం వెంటాడింది. ఒరిజినల్ ఆడియోతో HD ప్రింట్ ఆన్లైన్ లో లీకైంది(Movie Leak). దీంతో ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేగింది. సినీ వర్గాలు, నాని అభిమానులు షాక్ అవుతున్నారు. పైరసీని కట్టడి చేసి, చిత్ర పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సినీ పెద్దలు. మరోవైపు ఈ మూవీ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు డైరెక్టర్ శైలేష్ కొలను, హీరో నాని. అయితే వారివురు మూవీ లీక్ పై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Next Story