- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ODELA-2 : ఓదెల 2 కు భారీ షాక్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ కమిషన్
ఓదెల-2(ODELA-2) చిత్రానికి భారీ షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : ఓదెల-2(ODELA-2) చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఈ చిత్రంలో కులం పేరుతో ఉన్న అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌కు బీసీ కమిషన్(BC Commission) ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఆయా సన్నివేశాలను తొలగించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కమిషన్ సూచించింది. ఈ నెల విడుదలైన ఓదెల-2 సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ 116 రూపాయలు కానుక రాయించిన విషయమై జరిగిన వాద ప్రతివాదనలో పిచ్చగుంట్ల కులం(Pichaguntla Cast) పేరును అభ్యంతరకరంగా వాడినట్టు తమ దృష్టికి వచ్చిందని బీసీ కమిషన్ పేర్కొంది.
ఈ విషయంపై శుక్రవారం పిచ్చగుంట్ల కులానికి చెందిన పి.మల్లేష్ అనే వ్యక్తి బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసారని తెలిపిన కమిషన్.. ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగించాలని కోరినట్టు వెల్లడించింది. అయితే ఈ విషయంపై ఇదివరకే అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ చేయలేదని తెలిపారు. ఈ విషయమై కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్(Cyberabad CP)కు ఒక లేఖ రాస్తూ వెంటనే దర్యాప్తు చేసి.. ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయిత, ఆ అభ్యంతర పదాలను వాడిన నటులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరింది.
ఫిలిం సెన్సార్ బోర్డు(CBFC) ఈ అభ్యంతరకర పదాలు ఉన్నటువంటి చిత్రాన్ని, ఆ పదాలు తొలగించకుండా కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని కమిషన్ తప్పు పట్టింది. ఈ చిత్రం ప్రస్తుతం సినిమా థియేటర్‌లో నడుస్తున్నందున ఇకపైన జరిగే చిత్ర ప్రదర్శనలో ఈ అభ్యంతర పదాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ డిజిపి(Telangana DGP)కి కూడా ఈ ఉత్తరం కాపిని పంపిస్తూ వెంటనే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన సెన్సార్ బోర్డు అధికారి రాహుల్ గౌలీకర్ ఆ సన్నివేశములోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.






