విడుదలకు ముందే ‘కరుప్పు’కి భారీ సవాల్

by Pulgam srinivas |   (  Updated:2026-05-13 14:34:49  IST  )

ఓపెనింగ్స్ విషయంలో కరుప్పుకు సవాల్ విసురుతున్న పరాశక్తి.

విడుదలకు ముందే ‘కరుప్పు’కి భారీ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ సంవత్సరం తమిళ సినిమా పరిశ్రమ నుంచి విడుదల కానున్న భారీ చిత్రాల్లో సూర్య నటించిన కరుప్పు ఒకటి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. మొదటి నుంచే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ మూవీ ట్రైలర్ కూడా అదే స్థాయిలో ఉంటే అంచనాలు మరింత పెరుగుతాయని చాలా మంది భావించారు. కానీ ట్రైలర్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్‌లో సాగడంతో కొంతమంది ప్రేక్షకులు నిరాశ చెందారు. ఇక ఈ సంవత్సరం తమిళ సినిమా పరిశ్రమలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో పరాశక్తి 13 కోట్ల గ్రాస్‌తో మొదటి స్థానంలో కొనసాగుతోంది. దీనిని కరుప్పు ఈజీగా క్రాస్ చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం అది కాస్త కష్టంగానే కనిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదని సమాచారం. మరి ఓపెనింగ్స్ విషయంలో కరుప్పు, పరాశక్తి రికార్డును దాటుతుందో లేదో చూడాలి.

అంతర్జాతీయ వేదికపై ‘DC’ సినిమా ట్రైలర్.. విడుదల తేదీ ప్రకటించిన వామికా

Next Story