- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిఖిల్ ఖాతాలో హాలీవుడ్ ప్రాజెక్ట్.. ‘హీ మ్యాన్’గా మనోడి రచ్చ మామూలుగా లేదుగా!
ఈసారి ‘హీ మ్యాన్’ పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ట్రైలర్‌లో నిఖిల్ బేస్ వాయిస్ ఆ పవర్‌ఫుల్ వీరుడి పాత్రకు పక్కాగా సెట్ అయింది.

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే హాలీవుడ్ క్లాసిక్ క్యారెక్టర్ ‘హీ మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఇప్పుడు సరికొత్త యాక్షన్ విజువల్స్‌తో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మాణంలో, దర్శకుడు ట్రావిస్ నైట్ తెరకెక్కించిన ఈ లార్జర్ ద్యాన్ లైఫ్ ఫాంటసీ మూవీ ఇంగ్లీష్ ట్రైలర్ విడుదలై హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రబృందం హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు మన స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తే వచ్చే క్రేజ్ వేరు. ఈసారి ‘హీ మ్యాన్’ పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ట్రైలర్‌లో నిఖిల్ బేస్ వాయిస్ ఆ పవర్‌ఫుల్ వీరుడి పాత్రకు పక్కాగా సెట్ అయింది. కేవలం నిఖిల్ మాత్రమే కాకుండా టాలీవుడ్ లీడింగ్ యాక్టర్స్ ఈ సినిమా డబ్బింగ్‌లో భాగమయ్యారు. హాలీవుడ్ స్టార్ జారెడ్ లెటో నటించిన క్రూరమైన విలన్ పాత్రకు ఆదిత్య మీనన్ తన గంభీరమైన గొంతును అందించగా.. మ్యాన్ అట్ ఆర్మ్స్ (డంకన్) అనే కీలక పాత్రకు వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ డబ్బింగ్ చెప్పారు. ఈ ముగ్గురి వాయిస్ మ్యాజిక్ తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇవ్వబోతోంది. గ్రాండ్ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందిన ఈ చిత్రం జూన్ 5న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో భారీగా విడుదల కానుంది. ఇక విడుదలైన ట్రైలర్ చూసిన నెటిజన్లు మనోడి రచ్చ మామూలుగా లేదని అంటున్నారు.






