పండుగ పూట స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పండుగ పూట స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి చికిత్స పొందుతూ ఆదివారం నాడు మృతి చెందినట్లు సమాచారం. కిమ్ ఫెర్నాండెజ్ మార్చి 24న స్ట్రోక్‌తో ఐసీయూలో చేరారు. ఇక చికిత్స తీసుకుంటుండగా.. ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్ 6న తుది శ్వాస విడిచినట్లు సమాచారం. జాక్వెలిన్ తల్లి కిమ్ ఫెర్నాండేజ్(Kim Fernandez) తల్లి మరణించడంతో పండుగ పూట విషాద చాయలు అలుముకున్నాయి. జాక్వెలిన్ హాస్పిటల్‌కు వెళ్లిన వీడియో బయటకు రావడంతో సినీ ప్రముఖులతో పాటు పలువురు నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా అయ్యో పాపం అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, జాక్వెలిన్ సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు మోడల్ అయినప్పటికీ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సాహో’ మూవీలో కనిపించి అందరినీ మెప్పించింది. తెలుగు, హిందదీ, తమిళ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక ఇటీవల ‘ఫతే’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. కానీ హిట్ సాధించలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మెప్పించలేక వెనక్కి తగ్గింది.

Next Story