Producer Passed away: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2024-10-28 10:01:30  IST  )

టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Producer Passed away: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనీ నటుడు, ప్రముఖ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి (Jagarlamudi Radha Krishna) (85) ఇవాళ బాపట్ల జిల్లా (Bapatla District) కారంచేడు (Karamchedu)లోని తన స్వగృహంతో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముందు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసి నటుడిగా రాధాకృష్ణ మూర్తి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన ఆర్థికంగా స్థిరపడిన తరువాత సినిమా నిర్మాణ రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే వియ్యాల వారి కయ్యారు, ప్రతిబింబాలు, ఒక దీపం వెలిగింది, శ్రీ వినాయక విజయం, కోడళ్లొస్తున్నారు జగ్రత్త..! వంటి ఆధ్యాత్మిక, కుటుంబ కథా చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అయితే, 1982లో అక్కినేని నాగేశ్వర రావుతో ఆయన తీసిన ప్రతిబింబాలు చిత్రం వివిధ కారణాలతో 2022లో విడుదలైంది.

Read More..

Vijay – Trivikram : లైఫ్ లో ఇంకా చాలా సక్సెస్ అవ్వాలంటూ విజయ్ మీద వాఖ్యలు చేసిన త్రివిక్రమ్

Next Story