- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ చలనచిత్ర నటుడు, తిరకథా రచయిత, దర్శకుడు శ్రీనివాసన్ (Srinivasan) (69) ఆదివారం తెల్లవారుజామున మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మలయాళ చలనచిత్ర నటుడు, తిరకథా రచయిత, దర్శకుడు శ్రీనివాసన్ (Srinivasan) (69) ఆదివారం తెల్లవారుజామున మరణించారు. గత కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన త్రిపుణితుర (Tripunithura)లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసన్‌కు భార్య విమల, కుమారులు వినీత్ శ్రీనివాసన్ (Vineeth Srinivasan), ధ్యాన్ శ్రీనివాసన్ (Dhyan Srinivasan) ఇద్దరూ నటులుగా స్థిరపడ్డారు.
ఐదు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 225కు పైగా చిత్రాల్లో శ్రీనివాసన్ నటించారు. మలయాళ సినిమాను తన ప్రత్యేకమైన నటన, సామాజిక విమర్శలతో కూడిన హాస్యం, లోతైన కథలతో మలిచారు. ఆరు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు, నేషనల్ అవార్డు, పలు పురస్కారాలను ఆయన అందుకున్నారు. సందేశం, అజకీయ రవణన్, వరవెల్పు, నడోడికాట్టు, తలయానమంత్రం లాంటి గొప్ప కథలను రాశారు. వడక్కునోక్కియంత్రం, చింతావిష్టయాయ శ్యామల లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. మలయాళ సినిమాకు శ్రీనివాసన్ అందించిన కృషి అపారమైనదని గుర్తుచేస్తూ పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






