Director Suicide: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఆత్మహత్య

by Kema Shiva Kumar |   (  Updated:2024-11-03 07:12:25  IST  )

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Director Suicide: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ (Kannada Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ (Director Guru Prasad) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరు (Bangaluru)లోని తన ఇంట్లో ఉరేసుకుని కనిపించారు. అయితే, డెడ్‌బాడీ (Dead Body)ని చూస్తే ఆయన గత మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సూసైడ్‌‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దర్శకుడు గురు ప్రసాద్ మఠం, ఎద్దేలు మంజునాథ, రంగనాయక సినిమాలకు దర్శకత్వం వహించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును సైతం సొంత చేసుకున్నారు. బాడీగార్డ్, కుష్క, విజిల్, హుడుగురు, మైలారీ, జిగర్తాండ మూవీల్లో చక్కని నటనతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. హుడుగారు, విజిల్, సూపర్ రంగా చిత్రాలకు ఆయన డైలార్ రైటర్‌గా కూడా పని చేశారు.

Next Story